హోమ్ | సైట్ మ్యాప్ | సంప్రదించండి     
 
ఉపయుక్త లింకులు       >>
 
 
 
ఆన్ లైన్ బుకింగ్         >>
Follow Hotel Sai Krupa on Twitter
.
..
..
       హోటల్ గురించి
 
 హోటల్ సాయికృప మేనేజిమెంటు మరియు సిబ్బంది గురించి

హోటల్ సాయికృప మంచి- స్వభావంగల మరియు మంచి శిక్షణ పొందిన సిబ్బంది,మేనేజర్లు, సూపర్వైజర్లు, మరియు హౌస్ కీపింగ్ కాప్టెన్లను కలిగి ఉంది. మా వద్ద రుచికరమైన వంటకాలను తయారుచేసే మంచి నిష్ణతులయన వంటవారు కలరు.రూం సర్వీసు మరియు రెస్టారెంట్ సర్వీసు చూసుకోవడానికి తగినంత సిబ్బంది మా వద్ద ఉన్నారు. ప్రతి సిబ్బంది నిజాయితీ, విధేయత మరియు కష్టపడే వ్యక్తులు.
 
మేనేజింగ్ డైరెక్టర్ ఐనడా., అవినాష్ కోతస్థనే గారి కుమారుడు - శ్రీ.అమోల్ కోతస్థనే, మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆయన హోటల్ మేనేజిమెంటులో 3 సంవత్సరాల ప్రభుత్వ డిప్లమా ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం చేశారు. ఆయన పూణె మరియు ముంబైలో పరిశ్రమ- సంబంధితంగా 2 సంవత్సరాల పనిచేసిన అనుభవం తరువాత హోటల్ సాయికృపలో చేరారు. హోటల్ మేనేజిమెంటు మరియు ఇతర కార్యకలాపాలను చూసుకునే సమర్దుడైన కుటుంబ సభ్యుడు.
 
శ్రీమతి అవంతి కోతస్థనే కస్టమర్ కేర్ మరియు అకౌంట్స్ కు ఇన్ ఛార్జ్. శ్రీ జోషి సూపర్వైజర్, ఫ్రంట్ ఆఫీస్ మరియు రిసెప్షన్ చూసుకుంటారు.హోటల్ సాయికృప సిబ్బంది సమిష్టి కృషి మరియు చాలా సహకారంగా వుంటారు.
 
హోటల్ రూం బాయ్స్ చాలా నిజాయితీగలవారు. హోటల్ సాయికృప రూం బాయ్స్ ను ఎన్నుకునేటప్పుడు కఠినమైన ప్రమాణాలను పాటిస్తుంది . సాధారణంగా వారు సమీప గ్రామాల నుండి వస్తారు మరియు వారు చేసేపనిని శ్రద్ధగా నిర్వహిస్తారు. హోటల్ సిబ్బందిలో 80% మంది 5 సంవత్సరాలకు పైగా ఉంటున్నారు. మా సిబ్బంది యొక్క సమన్వయం మరియు నిజాయితీ వలన మాఅతిధులు మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి ఇవ్వగలుగుతున్నాము!
 
శ్రీమతి అంజలి కోతస్థనే హోటల్ పై వ్యక్తిగత శ్రద్ధ వహిస్తారు. అందరి సిబ్బంది సహాయ సహకారాలతో ఆమె ఇంటి వాతావరణాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. బాగా చదువుకున్న మహిళ ఐన శ్రీమతి అంజలి కోతస్థనే, అన్ని నాణ్యమైన సరుకులను కొనుగోలు చేసి రెస్టారెంట్ మెనూ ఎన్నిక చేస్తారు మరియు మా హోటల్ కు వచ్చిన అతిధుల సలహాలను పరిగణలోకి తీసుకుంటారు.

 హోటల్ సాయికృప యజమానులు /భాగస్వాముల గురించి

హోటల్ సాయికృపకు ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. అవినాష్ ఎస్. కోతస్థనే, వృత్తిరీత్యా డాక్టరు. 1970 నుంచి షిర్డీలో వైద్యం చేస్తున్నారు. ఇంకొక భాగస్వామి శ్రీ ఆనంద్ కోతస్థానే ఆస్ట్రేలియా నుండి ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలో మస్టర్స్ డిగ్రీ పొందారు. ఈయన సింగపూర్ మరియు ఇండియాలలో ప్రముఖ ఐటి కన్సంల్టెంట్.

 కోతస్థనే కుటుంబ నేపధ్యం 

డా. అవినాష్ కోస్తనే హోటల్ సాయికృప వ్యవస్థాపకులు. షిర్డీ మరియు అహ్మద్ నగర్ జిల్లాలో పేరొందిన వ్యక్తి. అతను రోగులకు 35 సంవత్సారలుగా సేవలు అందిస్తున్నారు. అతను ప్రాక్టీసును ఎక్కువగా సమాజ సేవకు ఉపయోగిస్తారు – ప్రత్యేకంగా చాలా బీదవారు మరియు సమాజంలో అణగారిన వారికి సేవ చేస్తారు. షిర్డీలో నివాసులకు మరియు షిర్డీ పరిసరాలో వుండేవారికి అతని స్నేహపూర్వక మరియు చాలా సహాయపడే స్వభావమువలన అతను మార్గదర్శి, ఉపదేశకుడు, శిక్షకుడుగా వుంటున్నారు . ఆయనను షిర్డీ హోటల్ యజమానలు అమితంగా గౌరవిస్తారు మరియు ఒక రోల్ మోడల్ గా చూస్తారు.
 
శ్రీమతి అంజలి అవినాష్ కోతస్థనే ముఖ్యంగా షిర్ఢీ మహిళలకు ప్రముఖ వ్యక్తి. ఆమె షిర్డీ గ్రామ పంచాయితీ సభ్యురాలుగా ఉన్నారు. షిర్డీలో మహిళల కొరకు సామాజిక ఉత్సవాలకు సమయాన్ని కేటాయిస్తారు మరియు చాలా సంవత్సరాలుగా మహళా మండలి అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె రేకీ కూడా ప్రక్టీసు చేస్తారు మరియు అధ్యాత్మపై గొప్ప అవగాహనను కలిగి ఉన్నారు.
 
డా. అవినాష్ కోతస్థనే తండ్రి మరియు తాత షిర్డీలో 1910 నుండి 1918 వరకూ శ్రీ సాయిబాబా ఉన్నప్పుడు ఉన్నారు. డా. అవినాష్ కోతస్థనే తాతగారు షిర్డీలో ప్రభుత్వ అధికారిగా నిమించబడినారు.
 
డా. ఏ.ఎస్. కోతస్థనే తండ్రిగారు ఐన స్వర్గీయ శ్రీ. సదాశివ్ శంకర్ కోతస్థనే అహ్మద్ నగర్ కంటోన్మెంట్ వద్ద ప్రముఖ ఆయుర్వేద వైద్యులు మరియు చాలా మంది స్వాతంత్ర సమరయోధలకు చికిత్సను చేసారు వారిలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూగారు కూడా వున్నారు . శ్రీ సాయిబాబా "దృష్టాంత" ప్రకారం షిర్డీకి వచ్చారు మరియు సాయిబాబా క్లాక్ రూంలో వున్నారు. ఈయన ప్రజలకు చేసే వైధ్యము శ్రీ సాయిబాబాకు చేసే సేవగా భావించేవారు. ఆయన 1953 నుంచి ఆయన గతించేవరకూ 1969 దాకా షిర్డీలోనే ఉన్నారు. మొత్తం కుటుంబం అంతా 1954 లో షిరిడి వలస వచ్చారు మరియు అప్పటి నుండి, శ్రీ సాయిబాబా ఆశీస్సులతో కుటుంబం పురోగతి చెందింది.
 
డా. అవినాష్ కోతస్థనే అన్నగారు – స్వర్గీయ శ్రీ. ముకుంద్ ఎస్. కోతస్థనే కూడా డాక్టరు. అతను బీదవారికి వైద్య చేసి "బీదల డాక్టరు" గా పేరు పొందారు.
 
కుటుంబం మొత్తానికి శ్రీ సాయి బాబాపై ఎనలేని విశ్వాసం మరియు అతని గొప్ప ఆశీస్సులు ఉన్నాయి. సాయిబాబా దీవెనలు మరియు ఆశీర్వాదాలతో, ఆ కుటుంబం గత 20 సంవత్సరాలుగా హోటల్ సాయికృపను నడుపుతునారు.


All Rights Reserved to Hotel Saikrupa,Shirdi
Developed By : Web and Map Solutions